Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Viral Videos: జస్ప్రీత్ బుమ్రాకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన బుమ్రా.. ఈ ఐపీఎల్‌లో మాత్రం తడబడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా ముంబై టీమ్ సైతం గత నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించలేదు. ఈ పరిణామాల అనంతరం బుమ్రాకు సంబంధించి కొన్ని వీడియోలో సోషల్ మీడడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరునవ్వుతో కనిపించే బుమ్రా.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో విపరీతమైన అసహనానికి లోనయ్యాడు. బుమ్రా బౌలింగ్ మార్కర్‌ను కోపంతో విసిరికొట్టడమే కాకుండా, నేల వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టాడు. మరో వీడియోలో బుమ్రా నవ్వుతూ కనిపించాడు. ఈ నవ్వు సాధారణ నవ్వు కాదు.. తీవ్ర అసహనం, నిస్సహాయతతో కూడుకున్న నవ్వుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో అభిమానుల గుండెలను పిండేశాయి. గతంలో జరిగిన మ్యాచ్‌లను గుర్తు చేస్తూ కొందరు ధైర్యం చెబుతుంటే.. మరి కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.
READ MORE: CheQ AU Credit Card: పేమెంట్ చేయగానే గ్రీన్ లైట్.. భారత్ లో మొదటి LED కో-బ్రాండెడ్ కార్డు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
బుమ్రా ఎందుకు తడబడుతున్నాడు?
బుమ్రా వైఫల్యంపై ముంబై కోచ్ మహేల జయవర్ధనే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు వికెట్లు తీసి ఒత్తిడి పెంచకపోవడమే బుమ్రాకు ప్రతికూలంగా మారుతోందని ఆయన విశ్లేషించారు. “తొలి ఓవర్లలో వికెట్లు పడకపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో అనవసర రిస్క్ తీసుకోవడం లేదు. అందుకే అతనికి వికెట్లు దక్కడం లేదు” అని జయవర్ధనే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా చిన్నపాటి గాయంతో (Niggle) బాధపడటం వల్ల సీజన్ ఆరంభంలో వేగం కాస్త తగ్గిందని, కానీ ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని కోచ్ స్పష్టం చేశారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బుమ్రా అద్భుతమైన బంతులు వేసినప్పటికీ అదృష్టం కలిసిరాక వికెట్ దక్కలేదని, ఒక్కసారి వికెట్ల ఖాతా తెరిస్తే బుమ్రాను ఆపడం ఎవరితరం కాదని జయవర్ధనే ధీమా వ్యక్తం చేశారు. వరుస ఓటములు, వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే బుమ్రా ఆగ్రహానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
The toxic Mumbai management and Hardik Pandya have completely broken my GOAT from inside It’s so painful to watch him like this. 💔
He is Surely missing his captain Rohit !! pic.twitter.com/ccloXXSahc
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 17, 2026
Jasprit Bumrah playing 5 matches, bowling 19 overs and picking 0 wickets this season is honestly shocking. This isn’t just a bad day this is a serious form issue. When the team needs impact, where is the senior bowler? pic.twitter.com/4702gZpmdn
— Vɪʜᴀᴀɴ (@TheRealPKFan) April 16, 2026
తాజావార్తలు
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!