అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. కానీ ఒకటి రెండు సినిమాల టీంలు మాత్రం పరిమితమైన బృందంతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చైతన్య, రాశి, మిగిలిన యూనిట్ ఒక నెల క్రితం ఇటలీకి వెళ్లారు. తాజాగా అప్డేట్ ప్రకారం ‘థాంక్యూ’ టీం ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఇంటికి తిరిగి వస్తున్నాము అంటూ ‘థాంక్యూ’ టీం ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు షూటింగ్ సెట్లో నాగ చైతన్య తో కలిసి దిగిన సెల్ఫీని పంచుకుంది రాశిఖన్నా. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక ‘థాంక్యూ’ టీం తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.