Suhas: సుహాస్ కథానాయకుడిగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిక్కని కంటెంట్ తో పాటు చక్కని సందేశాన్ని కూడా ఇచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాను కంప్లీట్ గా ఎంజాయ్ చేశానని చెప్పారు. ఈ చిత్రం కథానాయకుడు సుహాస్, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు మాట్లాడుతూ, “’రైటర్ పద్మభూషణ్’ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది! ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఈ చిత్రంతో చక్కని విజయాన్ని అందుకుంటున్న శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్ అండ్ టీమ్ అందరికీ అభినందనలు” అని తెలిపారు. అలాగే హీరో సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.