Prince Cecil: నందమూరి నట సింహం బాలకృష్ణతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ‘సింహా, లెజెండ్’ తర్వాత ముచ్చటగా మూడో విజయాన్ని ‘అఖండ’తో అందుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ స్టార్ రామ్ పోతినేనితో పాన్ ఇండియా మూవీని తీస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర ప్రిన్స్ ను వరించింది. తేజ దర్శకత్వం వహించిన ‘నీకు నాకు’ చిత్రంతో ప్రిన్స్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘బస్టాప్, నేను – శైలజ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రొటీన్ పాత్రల జోలుకు వెళ్ళకుండా విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు ప్రిన్స్. ఇందులో భాగంగానే ‘డీజే టిల్లు’ ‘ఎస్-5’ వంటి చిత్రాలలో నటించాడు. అలానే బిగ్ బాస్ షో లోనూ పాల్గొన్నాడు.
ఇదిలా ఉంటే… తన చిత్రాల్లోని మాస్ హీరోకు దీటుగా పవర్ ఫుల్ విలన్స్ ను తెరపై ప్రెజెంట్ చేయడంలో సిద్థహస్తుడైనా బోయపాటి తాజా చిత్రంలో ప్రిన్స్ కు విలన్ గా ఛాన్స్ రావడంతో అందరూ అతను నక్క తోక తొక్కాడంటూ కామెంట్ చేస్తున్నాడు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రిన్స్ కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. రామ్ మూవీలో మరోసారి నటించే ఛాన్స్ సంపాదించుకున్న ప్రిన్స్ పాత్ర ఇందులో హైలైట్ అవుతుందని అంటున్నారు. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీను రాశాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.