ఏపీలో ఒకే రోజు ఇద్దరు కేంద్ర మహిళా మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నేడు ఏపీలో పర్యటించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలౌతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.
Tearful Students: ప్రభుత్వ పాఠశాలల్లో సమయానికి రాని ఉపాధ్యాయులు, సరిగా బోధించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలలకు రాని ఉపాధ్యాయుల గురించి అందరూ మాట్లాడుకుంటారు.
Vande Bharat: హైదరాబాద్-బెంగుళూరు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ఈరోజు ఒకే సమయంలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోటా 2 రూపాయలకు మించి అమ్ముడు పోవడం లేదని.. దీంతో పెట్టుబడుల మాట అటుంచి కోత కూలీలు, రవాణ చార్జీలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది.