తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి శంకర నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, కరోనా భయంతో బయటకు రాకుండా ఉన్నారని అన్నారు. 14 సంవత్సరాల్లో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యాక్సినేషన్ కోసం చర్యలు తీసుకుంటోందని, చంద్రబాబు వ్యాక్సిన్ గురించి మోడీని […]
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు. ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు. ఇక […]
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పరిస్థతి వేరుగా ఉన్నది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు, 200 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని, లేదంటే కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తెలియజేసింది. […]
గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది. కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది. ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాల్లోని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని భుత్పూర్ మున్సిపాలిటీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో అక్కడి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు […]
మాములు రోజుల్లో సమ్మర్‌లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్‌కు తగిన విధంగా సమ్మర్‌లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం అమెరికాతో సహా కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారిపై మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, […]
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ ధరిస్తున్నా వైరస్ సోకుతూనే ఉన్నది. కరోనా మొదటి దశలో సింగిల్ మాస్క్ ధరించినా సరిపోయిందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ భీభత్సంగా ఉండటంతో తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని చెప్తున్నారు. లోపల సర్జికల్ మాస్క్ దానిమీద గుడ్డతో […]
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3915 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 […]
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్ధాయి సమావేశం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కీలక అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రగతి భవన్లో సమావేశం జరుగుతున్నది. మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ సమయం ముగియనున్నది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో […]