పాక్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పాక్ టాప్ సర్వీసెస్ లో దాదాపుగా పాక్ జాతీయులే అధికంగా ఉంటారు. అత్యున్నత ఉద్యోగాలు మైనారిటీలకు దక్కాలంటే చాలా కష్టం. కానీ, పాక్ కు చెందిన ఓ హిందూ మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అరుదైన ఘనతను సాధించింది. పాక్ సిఎస్ఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఈ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులు పాక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో పనిచేసే అవకాశం సొంతం చేసుకుంటారు. సింధ్ ప్రావిన్స్ […]
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ల పై అనేక మందికి అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరిగింది. సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ పై ఓ బామ్మ అవగాహన కల్పిస్తూ […]
ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో అనేక ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్పులు చేశారు. ఇందులో బడా హిందూరావ్ ఆసుపత్రి కూడా ఒకటి. ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 250 పడకలను ఏర్పాటు చేశారు. ఈ పడకలన్నీ కూడా కరోనా రోగులతో ఫుల్ అయ్యాయి. ఆయితే, ఈ ఆసుపత్రి నుంచి ఏప్రిల్ 19 నుంచి మే 6 వ తేదీ వరకు 23 మంది కరోనా రోగులు పరారైయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి కనిపించడం లేదు. దీంతో ఆదివారం రోజున ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కొంతమేర ఫలితం కనిపిస్తుందని శ్రీకాకుళం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఈరోజు సంపూర్ణ లాక్ […]
ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది […]
భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది. యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది. ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు. అమెరికా అధ్యక్ష […]
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్న వ్యక్తుల్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. సూరత్ లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తులకు వైద్యం చేయడం కష్టంగా మారిందని, ఖర్చుతో కూడుకొని ఉండటంతో అందరికి అందుబాటులో ఉండటం లేదని సూరత్ వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులు […]
చైనా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన విడిభాగాలను తీసుకొని లాంగ్ మార్చ్ 5 బీ అనే ఇటీవలే ఆకాశంలోకి దూసుకుపోయింది. అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు. ఈరోజు ఉదయం ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయింది. దాని శకలాలు జనావాసాలపై కాకుండా […]
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాల్లో కూడా వణికిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కనిపిస్తున్నారు. అయితే, గుజరాత్ లోని మోహ్సహా జిల్లాలోని బేచరాజీ మండలంలో చాందిని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.