తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్‌లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.