మాములు రోజుల్లో సమ్మర్‌లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్‌కు తగిన విధంగా సమ్మర్‌లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.