దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష […]
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల […]
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని, ఆర్ధిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, ఇప్పటికే 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మరాఠా ప్రజలు ఎలా రికార్ట్ అవుతారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉన్నది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉదయం కర్ఫ్యూ విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి షాపులతో పాటుగా మామూలు వాహనాలు, రవాహా వాహనాలు నిలిచిపోనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు. దీంతో […]
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148 కి చేరింది. ఇందులో 1,69,51,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,87,229 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3780 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722 కి చేరింది. ఇందులో 3,89,491 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,704 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన […]
కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బి.1.617, బి.1.618 తో పాటుగా ఎన్ 440 కె రకం వేరియంట్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిపై చేసిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. మొదటి దశలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా, రెండో దశలో ఒకటి నుంచి ఏకంగా ముగ్గురికి వ్యాపిస్తున్నట్టు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ […]
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతున్నది. సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో లాక్ డౌన్ పై రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే దేశంలో కరోనా మహమ్మారి […]