దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారికి విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని సత్నాలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి రామనామం పుస్తకం ఇచ్చి నాలుగు పేజీలు రామనామం రాయిస్తున్నారు. పేపర్ పై నాలుగు పేజీలు రాయడం అంటే మామూలు విషయం కాదు. రామ నామం రాయడం […]
కరోనా కాలంలో మనిషి ఎంత కాలం జీవిస్తాడో చెప్పలేని పరిస్థితి. కరోనా కంటే ముందు ఎంతకాలం జీవిస్తారో చెప్పగలిగే వారు. కానీ, కరోనా సమయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అయితే, ఓ పెద్దాయన ఇప్పటికే వందేళ్లకు పైగా జీవించాడు. ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. తాను ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం కోడి మెదడు అని చెప్తున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కోడి మెదడును ఆహారంలో తీసుకుంటున్నానని అదే తన ఆరోగ్య రహస్యం అని […]
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై పరిశోధకులు లోతైన పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ […]
టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్, […]
రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్ట్ లో కొంత ఊరట లభించింది. నిన్నటి రోజున రఘురామ అరెస్ట్, బెయిల్, ప్రైవేట్ లేదా ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు సంబందించి సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఎయిమ్స్ లో వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సీఐడీ పట్టుపట్టగా, రఘురామరాజు తరపు న్యాయవాదులు ప్రైవేట్ లేదా ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. కాగా, సుప్రీంకోర్టులో రఘురామకు కొంత ఊరట లభించింది. ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. […]
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమ్మర్‌లో కరోనా కేసులతో పాటుగా బంగారం ధరలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. ఈరోజు కూడా బంగారం ధరలు మరింతగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు జరుగుతుండటంతో చాలామంది […]
భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది. పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి. కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు. […]
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే […]
దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా మే 1 వ తేదీ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డిసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. మే 1 వ తేదీన కొన్ని వ్యాక్సిన్లు రష్యా నుంచి ఇండియాకు దిగుమతి కాగా, నిన్నటి రోజున మరికొన్ని వ్యాక్సిన్లు దిగుమతి అయ్యాయి. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డ్రైవ్ […]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కర్ఫ్యూ, కరోనా కేసుల విషయంపై ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు కట్టడి కావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని, ప్రస్తుతం కర్ఫ్యూ అమలులోకి వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యిందని, కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడం మేలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. మే […]