దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కరోనాను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. నగరాలు, పట్టణాలతో పాటుగా ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలను సైతం చుట్టేస్తోంది. దీంతో గ్రామాలు కరోనా బారిన పడుతున్నాయి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కరోనా వ్యాపించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి అంటూ వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగిపిన కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. అటు మీరట్ జిల్లాల్లో కరోనా రోగి అదృశ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాతో మరణించిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి మృతిగా వైద్యులు పేర్కొంటూ రిపోర్ట్ ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.