ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ […]
కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో పరీక్షలను రద్ధు చేస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్ధు చేస్తు వస్తున్నారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్ధు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో పుదుచ్చేరి కూడా చేరింది. విద్యార్ధులకు కీలకమైన ఇంటర్ పరీక్షలను నిర్వహించే అవకాశం కోసం ఇప్పటి వరకు ఎదురుచూశామని, కానీ, కరోనా కారణంగా ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదని, దీంతో పరీక్షలను రద్ధుచేస్తూ నిర్ణయం […]
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కారోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కోట్లాదిమందికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కెనడాలో ఇప్పుడు మరో వింత వ్యాధి ప్రభలుతున్నది. నిద్రలేమి, కండరాల బలహీనత, బ్రమ, పీడకలలు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అధికం అవుతున్నది. న్యూబ్రన్స్ వీక్ ప్రావిన్స్ […]
కరోనా మహమ్మారి కారణంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటివి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకపోతుండటంతో మూగజీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మూగజీవాలకు శ్రీ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తుంది. కల్లూరిపల్లిలో ఉన్న ఈ మూగజీవాల కేంద్రం ఎన్నో మూగజీవాలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ మూగ జీవాలకు చెన్నైకు చెందిన ఓజంట అండగా నిలిచింది. ఇటీవల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువజంట ఈ మూగజీవాల కేంద్రం గురించి తెలుసుకొని […]
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి విదేశీయాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. మేరిల్యాండ్ ఎయిర్‌ఫోర్స్ నుంచి టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్గించి సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరిల్యాండ్‌లో ల్యాడింగ్ చేశారు. తాము సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
గత నెలన్నరగా ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్ […]
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్‌డౌన్ పరిమితులను సడలించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం […]
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లికి సిద్దమయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైనపుడు కూడా ఎవరికి చెప్పలేదు. పెళ్లి సమయంలో ఆ యువతి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది. పెళ్లిపీటలమీద నుంచి కూడా యువతి చాటింగ్ చేయడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా కనిపించిన యువకుడిని పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి […]
రాష్ట్రంలో కరోనాకు, బ్లాక్ ఫంగస్‌కు పూర్తిగా ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్‌లోని గాంధి భవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.