గత నెలన్నరగా ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్ విషయంలో కూడా అమలు చేస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే కరోల్‌బాగ్, పాత ఢిల్లీ ఏరియాలు తిరిగి సందడిగా మారాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.