అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి విదేశీయాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. మేరిల్యాండ్ ఎయిర్‌ఫోర్స్ నుంచి టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్గించి సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరిల్యాండ్‌లో ల్యాడింగ్ చేశారు. తాము సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు.