ఢిల్లీలో కేసులు కనిష్టస్థాయికి చేరుకోవడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢల్లీలో మాములు సమయంలో నిత్యం రద్ధీగా కనిపించే కానాట్‌ప్లేస్, కరోల్‌భాగ్ ఏరియాల్లో చిన్న వ్యపారాల నుంచి వ్యాపారసముదాయాల వరకు అన్ని తెరుచుకున్నాయి. కానీ, కరోనా భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మాల్స్ వెలవెలబోయాయి. అటు రోడ్లు సైతం బోసిపోయి కనిపించాయి. కరోనా భయం […]
సెకండ్ వేవ్ ప్రభావం యువతపై ఎక్కువ పడిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపితే, సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మూడో వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మూడో వేవ్ ఎఫెక్ట్ ఏ వయసువారిపై అధికంగా ఉంటుంది అనే విషయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడోదశ కరోనా […]
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ […]
యూపీలో ఓ మామ తన కోడలిని రూ.80వేల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు మామతో సహా నిందితులను పట్టుకున్నారు. ఈ సంఘటన బారాబంకీ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో జరిగింది. గుజరాత్‌కు చెందిన పలువురి వద్ద వస్తువులను కొనుగోలు చేసిన మామ చంద్రరామ్ దానికి బదులుగా తన కోడలిని అమ్మకానికి ఉంచారు. అనంతరం కోడలిని తీసుకొస్తానని, రైల్వే స్టేషన్లో సిద్దంగా ఉండాలని చంద్రరామ్ చెప్పినట్టు పోలీసులు పేర్కోన్నారు. […]
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని […]
మేషం : ఉద్యోగస్తులు, విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగాలి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృషభం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తకొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు. […]
కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇంకా బయటపడక ముందే థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. మొదటి వేవ్ కంటే సెకండ్‌వేవ్‌లో ఎక్కవ కేసులు, మరణాలు సంభవించాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా యువతపై ఉన్నది. అయితే, థర్డ్ వేవ్ పొంచి ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ ప్రమాదం ముఖ్యంగా చిన్నారులపై ఉన్నట్టుగా నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. చిన్నారుల కోసం వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్నారు. అదేవిధంగా, చిన్నారుల కోసం సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంట్స్ […]
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని మూసేశారు. రాష్ట్రాలకు అదాయాన్ని అందించే మద్యం దుకాణలు సైతం మూతపడ్డాయి. గత నెల రోజులుగా లాక్డౌన్ ఆంక్షలు ఉండటంతో మందు షాపులు తెరుచుకోలేదు. దీంతో కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ మందును ఏకంగా రూ.800 కి అమ్ముతున్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు […]
దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పతి చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రయ కూడా వేగంగా సాగుతున్నది. విదేశాలకు చెందిన వ్యాక్సిన్లు ఇండియాకు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతి నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు […]