దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. 4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. 4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది. అయితే, నిన్నటి డేటా ప్రకారం ఇండియాలో 93,896 కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాల సంఖ్య 3,59,695 చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉన్నది.