ఉత్తర కొరియాలోని ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ స్వయంగా పేర్కోన్నారు. టైఫూన్ వరదలు రావడంతో ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కిమ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్తితులు కొంత ఆశాజనకంగా ఉండటంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియజేసింది. కరోనా విజృంభణ కారణంగా దేశ సరిహద్దులను మూసేసింది. Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు […]
హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఏ రెస్టారెంట్‌లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో కూడా బిర్యానీకే హైదరాబాదీలు మక్కువ చూపారు. ఇక ఇదిలా ఉంటే, మైలార్‌దేవులపల్లి మెఫిల్ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగాలేదని ప్రశ్నించిన ఇద్దరు యువకులను యాజమాన్యం చితకబాదింది. Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫలితాలు… దీంతో మైఫిల్ రెస్టారెంట్‌పై కేసులు నమోదు […]
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కరోనా కారణంగా ఆగిపోయిన పరీక్షలను కూడా తిరిగి నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. సుప్రీం కోర్టుకు మార్కుల ప్రణాళికను సీబీఎస్ఈ సమర్పించింది. Read: ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? సడలింపులు పెంచుతారా? 10,11 తరగతుల ఆధారంగా 12వ […]
లోక్ జనసత్తా పార్టీలో ఆదిపత్యపోరు మొదలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్యాన్ కు ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పారస్‌కు మధ్య అదిపత్యపోరు జరుగుతున్నది. లోక్‌సభ సభాపక్ష నాయకుడిగా పశుపతిని గుర్తించడంపై చిరాగ్ పాశ్వాన్ మండిపడుతున్నారు. తమ పార్టీ నియమావళిలోని 26 వ అధికరణ ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఉండాలనే దానిని సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, కాని, అలాంటివి ఏమీ జరగకుండానే పశుపతి కుమార్ పారస్ ను ఎలా నాయకుడిగా […]
ప్రపంచంలోనే ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మన్‌ను నియమించింది. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన జాన్ థాంప్సన్ స్థానంలో సత్యనాదెళ్లను నియమించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్దిలో సత్యనాదెళ్ల కీలకపాత్ర పోషించారు. 2014లో ఆయన్ను సీఈవోగా నియమించారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చెపట్టిన తరువాత ఆ కంపెనీ మరింత వేగంగా అభివృద్ది చెందింది. సీఈవోగా వ్యహరిస్తున్న సత్యనాదెళ్లను చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఏకగ్రీవంగా అమోదించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటి […]
ఆంధ్రపదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో టీడీపీ నేతలను ప్రత్యర్ధులు నరికి చంపారు. అడ్డొచ్చిన అనుచరులపై కూడా దాడులు చేశారు. పెసరవాయి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాపపడిన ముగ్గురిని నంధ్యాల ఆసుపత్రికి తరలించి వైద్యం […]
కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహన్ నగరంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా పక్కపక్కనే కూర్చున్నారు. వూహాన్‌లోని విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఒకచోట పదిమంది కలిసి కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. కలిసి తిరగాలంటే ఆంధోళన చెందుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావడంలేదు. 2019 డిసెంబర్ నెలలో వూహాన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత […]
మహారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటుగా కొన్ని స్వచ్చంద సేవాసంస్థలు, దేవాలయ ట్రస్ట్‌లు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ముంబైలోని జైన దేవాలయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచకులు, పేదలు, వీధి వ్యాపారులకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. టీకాలపై అవగాహన కల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
ప్రపంచంలో అమెరికా, రష్యా రెండు బలమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మద్య సంబంధాలు పెద్దగా లేవని చెప్పుకొవచ్చు. అయితే, రెండు దేశాల మద్య ఉన్న దూరాన్న తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నడుం బిగించారు. జెనీవాలో జరుగుతున్న నాటో దేశాల శిఖరాగ్రదేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు కూడా పాల్గోన్నారు. అమెరికా, రష్యా దేశాల అధినేతలు భేటీ ఆయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న […]
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. చెన్నైలోని ఆసుపత్రులు దాదాపుగా కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. నగదు, సెల్‌ఫోన్ కోసం కోవిడ్ రోగిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హత్యచేశారు. తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి వెనక సునీత అనే కరోనా రోగి మృత దేహాన్ని గుర్తించారు. ఈ […]