ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్‌డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా […]
దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఎయిమ్స్‌లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
కరోనా ముప్పునుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా సాధారణ జీవనం ప్రారంభం అవుతున్నది. చాలా మందికి కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపించకపోవడంతో వారిలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన వారి వివరాలను సేకరించి పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగి, లక్షణాలు కనిపించని వారిలో […]
నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొరవతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. గాజా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని బయటపెట్టలేదు. ప్రమాదకరమైన వాయువులు కలిగిన బెలూన్లను […]
గంగానదిలో ఓ పెట్టె కొట్టుకు వచ్చింది. దానిని తెరిచి చూసి పడవనడిపే వ్యక్తి షాక్ అయ్యాడు. ఆందులో 21 రోజుల వయసున్న చిన్నారి, పక్కన కాళీమాత అమ్మవారి ఫొటో ఉన్నది. ఫొటో పక్కన చిన్నారి జాతకం, గంగ అనే పేరు ఉన్నది. గంగా మాత ప్రసాదించిన చిన్నారిగా భావించిన ఆ వ్యక్తి పెంచుకుందామని ఇంటికి తీసుకుపోయాడు. అయితే, విషయం అధికారులకు తెలియడంతో హుటాహుటిన పడవ నడిపే వ్యక్తి ఇంటికి వచ్చి చిన్నారిని పెంచుకోవడానికి కుదరదని, విచారణ జరపాలని […]
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి సమన్లలో పేర్కొన్నది. బ్యాంకు రుణాలను వేరే సంస్థలకు మల్లించిన కేసులో నామా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఈడీ ఇటీవలే నామా ఇంటిపైన, కార్యాలయాలపైన దాడులు చేశారు. రెండు రోజులపాటు మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును ఈడీ స్వాదీనం చేసుకున్నది. స్వాదీనం […]
కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత […]
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్‌మెంట్ తరువాత తలెత్తున్న ఇన్‌ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్‌తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో […]
ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్‌లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్‌పై […]