దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కరోనా కారణంగా ఆగిపోయిన పరీక్షలను కూడా తిరిగి నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. సుప్రీం కోర్టుకు మార్కుల ప్రణాళికను సీబీఎస్ఈ సమర్పించింది.
Read: ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? సడలింపులు పెంచుతారా?
10,11 తరగతుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఉంటాయని తెలిపింది. దీనికొసం 30+30+40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు ఉండబోతున్నాయి. పరీక్ష రాయాలనుకునే విద్యార్ధులకు అవకాశం కల్పించాలని సీబీఎస్ఈ నిర్ణయించినట్టు కోర్టుకు తెలియజేసింది. జులై 31 వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.