కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహన్ నగరంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా పక్కపక్కనే కూర్చున్నారు. వూహాన్‌లోని విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఒకచోట పదిమంది కలిసి కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. కలిసి తిరగాలంటే ఆంధోళన చెందుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావడంలేదు. 2019 డిసెంబర్ నెలలో వూహాన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత కరోనా ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. ప్రపంచం అంతా ఒకలా ఉంటే, చైనాలో మాత్రం కరోనా అన్నది ఒకటి ఉందనే విషయం మరిచిపోయి ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారు. జనజీవనం సాధారణంగా మారిపోయింది.