NTV WebDesk
Author- NTV Telugu-
నాటో బలగాల ఉపసంహరణపై యూఎస్ మాజీ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజు అక్కడ హింసలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాదుల దౌర్జన్యాలకు అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తప్పుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శించారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం కాదని, బలగాల ఉపసంహరణ తరువాత […] -
నూతన ఆవిష్కరణ: జేబులోనే ఆక్సీజన్ బాటిల్…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ, దానిని ఒకచోట నుంచి మరోక చోటికి తరలించేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ ట్యాంకులు అంటే పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండే ట్యాంకర్లను వెంటబెట్టుకొని తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ వేవ్‌లో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శానిటైజర్ మాదిరిగా చిన్నగా ఉండే ఆక్సిజన్ బాటిల్‌ను రూపోందించారు […] -
ఆకాశంలో బంగాళదుంపను పోలిన చంద్రుడు… గ్రీకు పురాణాల్లో…
నాసాకు మార్స్ ఆర్బిటర్‌లోని హైరైస్ కెమెరా అంగారకుడికి చెందిన చంద్రుని ఫొటోను తీసింది. ఈ ఫొటోను నాసా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఒక్కసారిగా వైరల్‌గా మారింది. అంగారకుడి చంద్రడు ఫోబోస్ చూడటానికి అచ్చంగా బంగాళదుంపను పోలి ఉన్నది. అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారు. అందులో అతిపెద్దది ఈ ఫోబోస్ అని నాసా పేర్కొన్నది. ఈ ఫొటోను హైరైస్ కెమెరా ఫోబోస్ ఉపరితలానికి 6,800 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. ఇక ఇదిలా ఉంటే అంగారకుడికి చెందిన […] -
రాష్ట్రపతి ఎన్నికలపై పవార్ కీలక వ్యఖ్యలు…
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండుమార్లు భేటీ అయ్యారు. శరద్ పవార్ తో భేటీ తరువాత ఆయన అటు కాంగ్రెస్ కీలక నేతలైన రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలతో భేటీ ఆయ్యారు. అంతేకాదు, ఈ భేటీలో యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వర్చువల్‌గా పాల్గొన్నారు. రాబోయో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్ధిగా శరద్ పవార్‌ను రంగంలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. దీనిపైనే ప్రశాంత్ కిషోర్ […] -
పర్యాటకులకు శుభవార్త: తాజ్‌మహాల్ వేళల్లో మార్పులు… గంట ముందుగానే…
కరోనా తరువాత క్రమంగా అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగానికి అనుమతులు ఇవ్వడంతో దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకునే తాజ్‌మహల్ ను ప్రతిరోజు పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. నిన్నటి వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఉన్నది. తొలి సూర్యకిరణాలు తాజ్‌మహల్‌ను […] -
వచ్చేవారమే అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్…
అంతరిక్షంలో ప్రయాణం చేసేందుకు ప్రముఖులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్జిన్ గెలక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ రోదసిలోకి వెళ్లివచ్చారు. 90 నిమిషాలసేపు ఈ యాత్ర కొనసాగింది. నేల నుంచి 88 కిలోమీరట్ల మేర రోదసిలోకి వెళ్లి వచ్చారు. రోదసిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ యాత్రగా వర్జిన్ గెలాక్టిక్ రికార్డ్ సాధించింది. కాగా, ఇప్పుడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్ష […] -
భాగ్యనగరంలో భారీ వర్షం…ఉప్పల్‌లో రికార్ఢ్ స్థాయిలో…
దేశంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తున్నది. రాత్రి 11 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో […] -
జులై 15, గురువారం దినఫలాలు
మేషం: మీ ఆశయసాధనకు నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. దంపతుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమం. రుణాలు తీర్చేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వృషభం: చిన్న తరహా, చిరు పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మీ సంతానం పై […] -
కన్వర్ యాత్రపై సుప్రీంకోర్టు ఆగ్రహం: యూపీకి నోటీసులు
కన్వర్ యాత్రకు యూపీ అనుమతులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే, ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహాశివుడి భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్కడి పవిత్రమైన గంగానది జలాలను తీసుకొని వస్తారు. వాటిని స్థానికంగా ఉండే శివాలయంలో మహాశివునికి అభిషేకిస్తారు. ఈ యాత్ర ప్రతి […] -
పాక్‌లో హిందూ ఆలయంపై దాడి కేసు: 350 మంది విడుదల…
పాకిస్తాన్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక వందల ఆలయాలు పాక్‌లో ద్వంసం అయ్యాయి. అయినప్పటికి అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇటీవలే పురాతనమైన ఆలయపునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన పాక్ ప్రభుత్వం, ఒత్తిళ్ల కారణంగా వెకక్కితగ్గింది. ఇదిలా ఉంటే, కొన్నినెలల క్రితం ఖబర్ ఫంక్తున్సాలోని వందేళ్లనాటి హిందూ ఆలయం ఒకటి ద్వంసం అయింది. ఈ ఆలయం ద్వంసంపై అప్పట్లో 350 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చినెలలో హిందూ, ముస్లీంపెద్దల […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..