తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. చెన్నైలోని ఆసుపత్రులు దాదాపుగా కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. నగదు, సెల్‌ఫోన్ కోసం కోవిడ్ రోగిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హత్యచేశారు. తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి వెనక సునీత అనే కరోనా రోగి మృత దేహాన్ని గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.