దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తక్కువగా ఉండటంతో పాటుగా, కాలుష్యం కొంతమేర తగ్గిపోవడంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారుల వెంట ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. Read: ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం […]
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర నీటిమట్టం 27 మీటర్లకు చేరింది. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు చేరింది. వరద నీరు పెరుగుతుండటంతో ఆలయంలోకి భక్తులను నిరాకరించారు. దేవీపట్నం మండలంలోని […]
జూన్ 27 వ తేదీన డ్రోన్ సహాయంతో భారత వైమానిక స్థావరంపై దాడులు చేశారు ముష్కరులు. డ్రోన్‌ల నుంచి తెలికపాటి ఐఈడి బాంబులు జారవిడిచిన ఘటనలో వైమానిక స్థావరం పైకప్పు దెబ్బతిన్నది. కానీ, వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది డ్రోల్‌లపై కాల్పులు జరపడంతో తప్పించుకుపోయాయి. అయితే, ఆ ఘటన తరువాత భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. డ్రోన్ కదలికలపైన దృష్టిసారించింది. ఇక ఈ డ్రోన్‌ల నుంచి జారవిడిచిన ప్రెజర్ ప్యూజులు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ప్యూజులను […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం […]
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కోరిక ఉంటుంది. పెళ్లి కొందరి కల అయితే, అందరికంటే భిన్నంగా హనీమూన్ జరుపుకోవాలని కొందరికి ఉంటుంది. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకోవడం సాధ్యమేనా అంటే, ఒకప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిందిం. చంద్రుని మీదకు వెళ్లి వస్తున్న తరుణంలో అంతరిక్షంలో హనీమూన్ ఎందుకు సాధ్యంకాదు. అంతరిక్షంపై ఉన్న మక్కువ, ఆసక్తితో థామస్ వైట్‌సైడ్స్, లోరెట్టాలు 2006లో వివాహం చేసుకున్నారు. అప్పటికే అంతరిక్ష ప్రయాణాలపై పరిశోధనలు చేస్తున్న వర్జిన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు […]
విశ్వవిఖ్యాతి గాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే రథయాత్ర జరుగుతున్నది. సేవకులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర జరుగుతుండటంతో పూరీలో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి పూరీకి ఎవర్నీ అనుమతించడంలేదు. పూరీలోని సామాన్య ప్రజలు, భక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని టీవీల్లో లైవ్ ద్వారా […]
2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన శతృఘ్న సిన్హా ఆ తరువాత బీజేపీని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కూడా దూరంగా ఉంటున్న శతృఘ్న సిన్హా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈసారి ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. Read: ఏపీ […]
ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్‌ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ అంతర్గత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన నేసథ్యంలో తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు మిత్రదేశంగా భావిస్తున్నామని, షిన్జీయాంగ్ ప్రావిన్స్‌లో వేర్పాటువాద ఉఘర్ ముస్లీంలకు తాము మద్ధతు ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో […]