కరోనాకు మొదటగా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన తరువాత వేగంగా ఆ దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలు పెద్దగా అసక్తి చూపడంలేదు అన్నది వాస్తవం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ స్పుత్నిక్ వీ ని టీకాగా గుర్తించకపోవడమే ఇందుకు కారణం. రెండు డోసుల వ్యాక్సిన్‌పై ఇప్పుడు రష్యా ఆరోగ్యశాఖ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
Read: “వకీల్ సాబ్” వరల్డ్ టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే ?
వ్యాక్సిన్ డోసు తీసుకున్నాక కొన్ని రోజులపాటు వోడ్కా, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని గతంలో ప్రకటించింది. కాగా, తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మూడు రోజులపాటు శృంగారానికి దూరంగా ఉండాలని ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నాక శారీరకమైన శ్రమ చేయకూడదని, శరీరానికి రెస్ట్ ఇవ్వాలని, శృంగారం అనేది శారీరక శ్రమతో కూడుకొని ఉంటుందని రష్యా ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై అక్కడి పౌరులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇప్పుడు ఈ ప్రకటనతో మరింత మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రష్యాలో డెల్టావేరియంట్ విజృంభిస్తున్నది. నిన్నటి రోజుల ఆ దేశంలో 25,033 కరోనా కేసులు నమోదయ్యాయి.