తెలిసింది గోరంత… తెలయంది కొండంత.. అంతకంటే ఇంకా ఎక్కవే… అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. రష్యా వ్యోమగామి యూరిగగారిన్ ఎప్పుడేతే అంతరిక్షంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి మరింత ఆసక్తి నెలకొన్నది. పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంటరయ్యాక ఒక్కసారిగా పోటీ మొదలైంది. వర్జిన్ గెలక్టిక్, బ్లూఆరిజిన్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధన మొత్తం అంతరిక్ష యాత్ర చుట్టూనే జరుగుతున్నాయి. […]
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. […]
తెలంగాణలో ఇటీవలే కొత్తగా ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగుతుంది. ఈరోజు వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఉద్యోగాలకు […]
అమెరికాలో మరో ఉద్యమానికి ఊపిరి పోసుకున్నది. పక్షులను చంపొద్దని అంటూ వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే పేరుతో ఉద్యమం జరుగుతున్నది. అమెరికా వీధుల్లో ఎరుగుతున్న పక్షులు నిజం కావని, నిజమైన పక్షులను అధికారులు చంపేస్తున్నారని, ఇప్పటికే లక్షలాది పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబొటిక్ పక్షులను ప్రవేశపెట్టారని, ఆ పక్షులు అమెరికన్ల జీవనాన్ని గమనిస్తున్నాయని ఆందోళనలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే సిద్ధాంతం ఇప్పుడు మొదలైంది […]
ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి […]
దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని అన్ని క్షేత్రాలు, ప్రముఖ టూరిజం ప్రాంతాలు తిరిగి తెరుచుకున్నాయి. చాలా కాలం తరువాత పర్యాటక ప్రాంతాలకు అనుమతులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున టూరిస్టులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కరోనా నిబందనలు గాలికి వదిలేయడంతో కరోనా భయం పట్టుకుంది. దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, మూడో వేవ్ అనివార్యమని ఇండియన్ మెడికల్ అసోసియోషన్ పేర్కొన్నది. Read: బికినీలో హద్దులు దాటేస్తున్న […]
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రతో పాటుగా అటు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక త్రిపురలో డెల్టాప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. Read: తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి […]
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు, […]
మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా… లింక్ చేయకుంటే అనేక బెనిఫిట్స్‌కు కోల్పోవాల్సి ఉంటుందని ఇప్పటికే మెసేజ్‌లు వస్తుంటాయి. మొబైల్ ఫోన్‌ను ఆధార్‌కు జత చేయాలని అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆధార్‌ను లింక్ చేసుకొవచ్చు. అందుకోసం ask.uidai.gov.in లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆనంతరం మీ మొబైల్‌కు ఓటీపి వస్తుంది. […]
విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు. Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్ […]