దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని అన్ని క్షేత్రాలు, ప్రముఖ టూరిజం ప్రాంతాలు తిరిగి తెరుచుకున్నాయి. చాలా కాలం తరువాత పర్యాటక ప్రాంతాలకు అనుమతులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున టూరిస్టులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కరోనా నిబందనలు గాలికి వదిలేయడంతో కరోనా భయం పట్టుకుంది. దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, మూడో వేవ్ అనివార్యమని ఇండియన్ మెడికల్ అసోసియోషన్ పేర్కొన్నది.
Read: బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ
తప్పనిసరిగా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని లేదంటే ముప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. మాస్క్ తప్పనిసరి చేయాలని, శానిటైజర్లు వాడాలని తెలిపింది. రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలు విధించాలని, వీలైనంత వరకు పర్యాటకులు తమ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించింది. సమ్మర్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, వచ్చే ఏడాది సమ్మర్‌లో నాలుగో వేవ్ తప్పదని హెచ్చరించింది ఐఎంఏ.