మామూలుగా ఎవరైనా సరే 8 గంటలు లేదా 10 గంటలు నిద్రపోతారు. చిన్నపిల్లలైతే రోజులో 16 గంటలు నిద్ర తప్పనిసరి. అయితే, ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం గంటలు కాదు రోజుల తరబడి నిద్రపోతున్నారట. కొందరు రెండు మూడు రోజులపాటు లేవకుండా నిద్రపోతే, మరికొందరు మాత్రం ఆరు రోజులపాటు నిద్రపోయేవారట. ఆకలిదప్పికలు అన్నిమరిచిపోయి అలా ఎందుకు నిద్రపోయేవారో అంతుచిక్కలేదు. ఇలా లేవకుండా నిద్రపోతున్న విషయం తెలుసుకున్న అధికారులు వైద్యులను పంపి వారికి సెలైన్ పెట్టించేవారు. ఇక లేచిన […]
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. కాశ్మీర్‌లోని అర్ణియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించినట్టు ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి సమీపంలో ఈ డ్రోన్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో 200 మీటర్ల భారత్ భూభాగంలోకి డ్రోన్ వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. డ్రోన్ కోసం భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గూఢచర్యం లేదా ఆయుధాలను గాని జారవిడిచి ఉండొచ్చని అధికారులు […]
కరోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా గట్టిగా చెబుతున్నది. ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్దమొత్తంలో మిగులు వ్యాక్సిన్లను నిల్వ చేసింది అమెరికా. దాదాపుగా 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను వివిధ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైన అమెరికా ఇప్పటికే 40 మిలియన్ వ్యాక్సిన్ డోసులను నేపాల్, భూటాన్, […]
ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్లు చేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఈ ఫాస్ట్‌ఫుడ్‌లో వెరైటీలు కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి వాటికి ఎప్పుడూ గిరాకీ అధికంగానే ఉంటుంది. బర్గర్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ గోల్డెన్ బర్గర్. పేరుకు తగినట్టుగానే దీన్ని బంగారంతో తయారు చేశారు. ఈ బర్గర్ తయారీలో ఖరీదైన కేవియన్, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్, పందిమాంసం, ఆరుదైన తెల్లని […]
ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. వేగంగా టీకాలు వేస్తుండటమే ఇందుకు కారణం. నిన్నటి రోజున కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే, ఈరోజు స్వల్పంగా కేసులు పెరిగినట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,792 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది. ఇందులో 3,01,04,720 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,29,946 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. Read: […]
దక్షిణాఫ్రికాలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లరి మూకలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర సమరయోధుడు నెల్సన్ మండేలా స్పూర్తితో అప్పట్లో దక్షిణాఫ్రికా స్వాతంత్రపోరాటంతో పాల్గొని తరువాత రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎదిగిన జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు. వీరి మూలాలు ఇండియాలోనే ఉండటం విశేషం. యూపీలోని సహరాన్‌పూర్ సమీపంలోని ఓ […]
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కడే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను జోరుగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 40 కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందించారు. అయితే, దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటిస్థానంలో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్‌లో 18 ఏళ్లు దాటిన వారిలో 61.1శాతం మందికి వ్యాక్సిన్ అందించింది. హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో […]
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఎక్కువ మంది భక్తులు అలిపిరి కాలిమార్గం ద్వారా కొండకు చేరుకుంటూ ఉంటారు. అయితే, కరోనా లాక్‌డౌన్ సమయంలో మే నెలలో అలిపిరి నడక మార్గాన్ని మూసేసి మరమ్మత్తులు చేయాలని సంకల్పించింది. Read: కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ! రెండు నెలల్లో నడక మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేయాలని అనుకున్నా, ఆ […]