NTV WebDesk
Author- NTV Telugu-
పులిచింతలలో భూప్రకంపనలు…
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్ -
వైరల్: ఉన్నట్టుండి కదిలిన వింత ఆకారం… దెయ్యమే అంటోన్న స్థానికులు…
కొన్ని వస్తువులు ఉన్నట్టుండి కదులుతుంటాయి. అవి ఎందుకు అలా కదులుతాయో తెలియదుగాని అలాంటి విషయాలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఆ విషయాల గురించి నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తుంటారు. కొంతమంది వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని చెబితే, మరికొందరు మాత్రం వాటిని దెయ్యాలుగా చెబుతుంటారు. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అది నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతం. రాజేంద్ర అనే ఆటో డ్రైవర్ తన ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో వింతఆకారానికి […] -
ఏపీ రాజధాని ప్రాంతంలో ఆంక్షలు… నో ఎంట్రీ బోర్డులు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమానికి ప్రజలు నడుం బిగించి నేటికి 600 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధానిలోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వరకు ర్యాలీని నిర్వహించాలని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి […] -
ఒబామా బర్త్‌డే పార్టీపై విమర్శలు… ఎందుకంటే…
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 60 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొదట ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిధులను పిలవాలని అనుకున్నా, కరోనా ఉధృతి కారణంగా ఆ సంఖ్యను తగ్గించారు. ఈ వేడుకలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే, ఈ వేడుకలకు హాజరైన వారిలో చాలామంది మాస్క్ పెట్టుకోలేదని, ప్రస్తుతం అమెరికాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయని, సెలబ్రిటీలు మాస్క్ పెట్టుకోకుండా […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. ఇందులో 3,10,99,771 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,06,822 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. దేశంలో కొత్తగా కరోనాతో 491 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. ఇకపోతే, […] -
కేరళలో దీదీ పోస్టర్లు… వైరల్…
బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్నది. దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే అలోచనలో దీదీ ఉన్నట్టు సమాచారం. దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు. కేరళలో దీదీని పిలవండి… దేశాన్ని కాపాడండి…ఛలో ఢిల్లి… పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేరళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 34 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా బెంగాల్‌ను శాశించిన వామపక్షాల కోటను బద్దలుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వచ్చింది. […] -
ఎలన్ మస్క్ అరుణగ్రహ యాత్ర కల నిజమౌతుందా?
ఎలన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మరో అంకానికి తెరతీసింది. అంగారక గ్రహం మీదకు ప్రయాణికులను పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. స్టార్ షిప్ పేరుతో ఓ భారీ వ్యోమనౌకను తయారు చేస్తున్నది. ఇందులో 100 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్టార్ షిప్‌ను రీయూజబుల్ మోడల్లో తయారు చేస్తున్నారు. 120 మీటర్ల పొడవున్న ఈ స్టార్ షిప్లో ఆరు రాప్టర్ ఇంజన్లు ఉంటాయి. ఇక […] -
ఆ దేశం నుంచి వచ్చే పౌరులకు అమెరికా రుణాలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని […] -
నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించారడు. జావెలింగ్ త్రో విభాగంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వందేళ్ల చరిత్రలో ఇండియాకు తొలిసారి స్వర్ణపతకం లభించింది. జావెలింగ్ త్రో విభాగంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన నీరజ్ చోప్రాకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అదిరిపోయే కానుకను అందించేందుకు సిద్ధం అయ్యారు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని కానుకగా అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని […] -
ఆగస్టు 8, ఆదివారం దినఫలాలు
మేషం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్నిసందర్శిస్తారు. వృషభం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్, […]
తాజావార్తలు
-
Yemen Airport Attack: యెమెన్‌లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!