NTV WebDesk
Author- NTV Telugu-
ఆగస్టు 13 నుంచి కొత్త రూల్స్… అక్కడికి వెళ్లాలంటే…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెకండ్ వేవ్ సమయంలో భారీగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా, మరణాలు మూడు వేలకు పైగా నమోదయ్యాయి. కాస్త తెరిపించడంతో అన్ని రంగాలను తిరిగి ప్రారంభించారు. పర్యాటక రంగం తిరిగి ప్రారంభం కావడంతో హిమాచల్ ప్రదేశ్ వంటి హిల్ స్టేషన్ రాష్ట్రాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. మాస్క్‌ను పక్కన పెట్టి తిరుగుతుండటంతో ఆ […] -
పెద్దల సభలోనూ అదే సిత్రం… చైర్మన్ కంటతడి…
లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పెద్దల సభగా పెరుపొందిన రాజ్యసభలోనూ సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నిరసనలు తెలియజేశాయి. ఎంపీలు నిలబడి, బల్లలపైకి ఎక్కి పెద్దగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక దేవాలయం వంటిదని, కొందరు ఎంపీలు అమర్యాదగా ప్రవర్తించారని, పోడియం ఎక్కి నిరసనలు చేయడం అంటే, గర్భగుడిలో నిరసనలు చేయడమే అని రాజ్యసభ […] -
లోక్‌సభ నిరవధిక వాయిదా… షెడ్యూల్ కంటే ముందే…
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రసాభాసాగా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నూతన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబడుతూ వచ్చాయి విపక్షాలు. నినాదాలు, నిరసనల మధ్య సభను నిర్వహించారు. అయితే, ఈరోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు […] -
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు…
తెలంగాణలోని హుజురాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నది. ఈటల రాజీనామా తరువాత ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, టీఆర్ఎస్ నుంచి ఎవర్ని నిలబెడుతున్నారన్నది ఇప్పటి వరకు ఆసక్తికరంగా ఉంది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 38,353 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,511 కి చేరింది. ఇందులో 3,12,20,981 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 3,86,351 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 497 మంది మృతి చెందారు. […] -
ఆ నది ఒడ్డున వెండినాణేలు…ఎగబడిన జనం…
వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. కొన్ని చోట్ల లంకెబిందెలు బయటపడుతుంటాయి. అయితే, మధ్యప్రదేశ్‌లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గుణ జిల్లాల్లోని సింధ్ నది పొంగిపోర్లింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. వరద నీరు వెనక్కి వెళ్లిన తరువాత నదీ తీరంలో వెండినాణేలు బయటపడ్డాయి. అశోక్‌నగర్‌లోని పంచ్వాలిలోని నదీతీరంలో ఈ నాణేలు బయటపడ్డాయి. కొంతమందికి పాతకాలం నాటి నాణేలు దొరకడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొని నాణేల […] -
అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం…42 మంది మృతి…
ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. అల్జీరియాలోని కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సడెన్‌గా పలుదఫాలుగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సైన్యం రంగంలోకి దిగి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మంటల్లో ఇప్పటి వరకు 42 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇంతో 25 మంది సైనికులు, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. పౌరులను రక్షించే క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు […] -
ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ దృష్టి…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి. 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. అయితే, ఈ సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచింది. అయినప్పటికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేకపోతున్నది. పార్టీని తిరిగి బలోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది […] -
ఆ పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు… ఎక్కడో తెలుసా…!!
కొంతమంది తమ ఆస్తులను పిల్లల పేరుమీద, సంస్థల పేరుమీద రాస్తుంటారు. కానీ, ఆక్కడ మాత్రం పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. పావురాల పేరుమీద 30 ఎకరాల భూమి, 27 షాపులు, బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందట. అదేంటి పావురాల పేరుమీద ఇంత మొత్తంలో ఆస్తులు ఉండటం ఎంటి? ఎవరు ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నారా… అదే ఇప్పుడు చూద్దాం. రాజస్తాన్‌లోని నాగౌర్ పరిధిలో జస్నాగర్ అనే గ్రామం ఉన్నది. నాలుగు దశాబ్దాల కిందట […] -
ఆగస్టు 11, బుధవారం దినఫలాలు…
మేషం : వ్యాపార రీత్యా దూర ప్రయాణ చేయవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వృషభం : స్త్రీలకు స్వీయ అర్చన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కపటం లేని ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాధించి పెడుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!