సముద్రంలో నివశించే ఆక్టోపస్‌కు సాధారణంగా 8 టెంటికల్స్ ఉంటాయి. మనిషి కాళ్లు చేతులు ఎలా వినియోగిస్తాడో అదేవిధంగా ఆక్టోపస్ కూడా తన టెంటికల్స్‌ను వినియోగిస్తుంది. సాధారణంగా ఈ జీవులు సముద్రంలో అడుగున తన 8 టెంటికల్స్ సహాయంతో నుడుస్తుంటాయి. కానీ, ఈ అసాధారణ ఆక్టోపస్ అందుకు విరుద్ధంగా మనిషి నడిచన విధంగానే రెండు టెంటికల్స్ తో వేగంగా నడుస్తూ పరుగులు తీసింది. దీనికి సంబందించిన వీడియోను బ్యూటెన్ గెబీడెన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ […]
సాధారణంగా ప్లీమియర్ విస్కీ బాటిల్ ఖరీదు రూ.10 వేల వరకు ఉంటుంది. అదే విదేశీ కంపెనీకి చెందిన బాటిల్ అయితే లక్షల్లో ఉండోచ్చు. కానీ, ఈ మద్యం బాటిల్ ఖరీదు మాత్రం ఏకంగా కోటి రూపాయలు పలికింది. ఇది మాములు విస్కీ బాటిల్ కాదు. సుమారు 250 ఏళ్ల క్రితం తయారు చేసిన బాటిల్. ఈ విస్కి బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్. దీనిని 1860 వ సంవత్సరంలో తయారు చేశారు. ఇంగ్లాండ్‌లోని ప్రముఖ వేలం సంస్థ […]
ఎప్పుడో సోకిన వ్యాధులు తిరిగి మళ్లీ విస్తరిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం అంటే 2003వ సంవత్సరంలో అరుదైన మంకీఫాక్స్ కేసులు అనేకం వ్యాపించాయి. ఆ తరువాత ఆ కేసులు మెల్లిగా కనుమరుగయ్యాయి. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కేసులు బయటపడుతుండటంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇటీవలే టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి నైజీరియా వెళ్లి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తిలో ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తిని డాలస్‌లోని ఆసుపత్రిలో వేరుగా ఉంచి చికిత్స […]
గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతకాలం నాటి ఇళ్లు కూలిపోతున్నాయి. అటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబైలో ఇప్పటి వరకు 23 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో […]
కరోనా నుంచి సడలింపులు ఇచ్చిన తరువాత దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. శ్యాససంబంధమైన జబ్బులతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా టెస్టల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారికి క్షయకు సంబందించిన టెస్టుకు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్నాక అనేక మంది క్షయవ్యాధికి గురవుతున్నారని కేంద్రానికి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. Read: ఆగస్టు 6న థియేటర్లలో ‘మెరిసే మెరిసే’ […]
యూరప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుండటంతో వరదనీరు యూరప్‌లోని బెల్జియం, జర్మనీ దేశాలను ముంచెత్తింది. ఈ వరదల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్టు సమాచారం. వందల మంది వరదనీటిలో కొట్టుకుపోయారని, వారి ఆచూకీ కోసం డిజాస్టర్ టీమ్, ఆర్మీ బృందాలు గాలిస్తున్నాయని జర్మనీ అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ప్రభావం జర్మనీలోని అహాల్వర్ కౌంటీ, రైన్‌లాండ్-పలాటినేట్, నార్ట్‌రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే జర్మనీ కరోనా తో […]
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా, తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభమైంది. రెండు వేవ్‌ల నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల్లో ఏలాంటి మార్పు రాలేదు. మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ దేశంలో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ నెల నుంచి కేసులు తగ్గడంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గింది. కాగా, ఇప్పుడు మరలా […]
ప్రపంచంలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడంలేదు. కొన్ని దేశాల్లో తగ్గినట్టు కనిపించినా తిరిగి కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త రకాల వేరియంట్లు పుట్టుకురావడంతో కరోనా మహమ్మారి కట్టడి సాధ్యం కావడంలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఏ దేశంలోనూ కరోనా ముగింపుకు రాలేదని, కొత్త వేరియంట్లు ప్రమాదకరమైన వేరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. బ్రిటన్‌లో జరిగిన యూరోకప్, దక్షిణ అమెరికాలో జరిగిన కొపా అమెరికా కప్ కారణంగా ఆయా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, […]
కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని టీకాలు ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకాలను శీతలీకరణ గడ్డంగుల్లో భద్రపరచాల్సిన టీకాలే. ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వరకు ఫ్రీజింగ్ చేయాలి. ఫైజర్, మోడెర్నా టీకాలను మైనస్ 70 డిగ్రీల వద్ధ స్టోర్ చేయాలి. అయితే, […]