ఈరోజు నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేయబోతున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. బత్తినివానిపల్లిలోని ఆంజనేయుని దేవస్థానంలో ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు. రేపు సాయంత్రం అంబల గ్రామంలో బస చేస్తారు. 23 రోజుల పాటు 270 కిలోమీటర్ల మేర ఈటల పాదయాత్ర సాగుతుంది.
Read: కాస్త ముందుగానే రానున్న “నారప్ప”