దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పిల్లల టీకాలపై చర్చించినట్టు సమాచారం.
Read: అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!
చిన్నారుల టీకా కోసం ఇప్పటికే భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో 12-18 ఏళ్ల మధ్య వయసుగల పిల్లలపై ఇప్పటికే జైడస్ క్యాడిలా క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. అయితే, భారత్ బయోటెక్ మాత్రం 2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై మూడో దశ ప్రయోగాలు చేస్తున్నది. దీనికి సంబందించిన ఫలితాలు త్వరలోనే రానున్నాయి. దీనికి సంబందించిన ఫలితాలు వెలువడిన వెంటనే అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.