కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నకు సమర్పించిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి నియామకం జరిగే వరకు ఆయన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తెలిపారు. అయితే, సీనియర్ నేత యడ్యూరప్ప రాజీనామా తరువాత ఆ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలామంది ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. అనేక పేర్లు బీజీపీ అధిష్టానం ముందుకు వచ్చినట్టు సమాచారం.
Read: “ఏకే” రీమేక్ లో “భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
యడ్యూరప్ప రాజీనామా తరువాత పార్లమెంట్ ఆవరణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎవర్నిఎంపిక చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, విశ్వేశ్వరన్ హెగ్డే, మురుగేష్ నిరానీ, అరవింద్ బెళ్లాడ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రరాజకీయాలపై పూర్తిస్తాయిలో పట్టున్న నేతను ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ప్రహ్లాద్ జోషి గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించారు. రాష్ట్రరాజకీయాలతో పాటుగా, కేంద్రంతో మంచి సంబందాలు ఉండటంతో ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, కర్నాటకలో లింగాయత్‌లకు మంచి పట్టు ఉన్నది. యడ్యూరప్ప కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ఆ వర్గాన్ని సంతృప్తి పరచాలంటే మురుగేష్ నిరానీకి అవకాశం కల్పించాలి. అయితే, ఆర్ఆర్ఆర్ మాత్రం ప్రహ్లాద్ జోషి వైపు మొగ్గు చూపుతున్నది. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.