కరోనా అంటే చైనా గుర్తుకు వస్తుంది. చైనాలోని వూహన్ నుంచి ఈ వైరస్ మొదలై ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. రెండేళ్లుగా కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా దాదాపుగా 40 కోట్లకు పైగా పందులు మరణించాయి. దీంతో చైనీయులు మాంసం కోసం అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఆయా దేశాలు ఈ మాంసం ధరలను భారీగా పెంచేశాయి. పైగా, కరోనా కారణంగా ఎగుమతులపై ఆయా దేశాల్లో […]
రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. కేంద్రంపై ఉమ్మడిపోరును సాగించేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులపై సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించుకోవడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు తగ్గాయి. ఇండియలో తాజాగా 30,549 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి చేరింది. ఇందులో 3,08,96,354 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,25,195 మంది మృతి […]
ఒసామా బీన్ లాడెన్ ప్రపంచాన్ని గడగడలాండించన ఉగ్రవాది. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చివేతలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి. పాక్‌లో తలదాచుకున్న సమయంలో ఆయన్ను అమెరికా సైన్యం హతమార్చింది. లాడెన్ సోదరుడు ఇబ్రహీమ్ కు లాస్ ఎంజెల్స్‌లో ఓ విలాసవంతమైన భవంతి ఉన్నది. 2001 ఘటనకు ముందు వరకు ఆ ఇంట్లో ఇబ్రహీమ్ లాడెన్ కుటుంబ సభ్యులు ఉండేవారు. ఎప్పుడైతే 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేత జరిగిందో ఆ తరువాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ […]
టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి క్వార్టర్‌లో 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న ఇండియా సెకండ్ క్వార్టర్‌లో సంచలనాలు చేయలేకపోయింది. అటు బెల్జియం జట్టు తనదైన శైలిలో విజృంభించి మరో గోల్ చేయడంతో సెకండ్ క్వార్టర్ 2-2తో సమం అయింది. అయితే, మూడో క్వార్టర్‌లో ఎవరూ ఎలాంటి గోల్ చేయలేదు. కానీ నాలుగో క్వార్టర్‌లో బెల్జియం […]
ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు చలానా విధించినా వాహనదారులు వాటికి కట్టకుండా లైట్‌గా తీసుకొని వాహనలు నడుపుతున్నారు. తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అంటున్నారు. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనంపై ఏ ఒక్క చలానా కూడా పెండింగ్‌లో ఉండకూడదని, ఒకవేళ పెండింగ్‌లో చలానాలు ఉంటే వాహనాన్ని వెంటనే సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వాహనానికి సంబందించి ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా […]
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా తిరిగి బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతున్నది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ దృష్టిమొత్తం ఏపీపైనే ఉంచడంతో తెలంగాణలో పార్టీ వెనుకబడిపోయింది. ఇక, 2018 తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే చేయలేదు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా బలహీనపడింది. ఒకప్పుడు అనేక మంది కార్యకర్తలు, నేతలు ఉండేవారు. […]
కరోనా సెకండ్ వేవ్ తరువాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో మార్కెట్లు తిరిగి పాత సోభను సంతరించుకుంటున్నాయి. కరోనా సమయంలో పైపైకి కదిలి సామాన్యుడు కొనలేనంతగా మారిపోయిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం ధర రూ. […]
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన రోటావాక్-5డికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. పిల్లలకు వ్యాపించే రోటా వైరస్ నుంచి రక్షణ కోసం ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇప్పటికే రోటావాక్ ను తయారు చేసిన ఈ సంస్థ మరింత రక్షణ కోసం 5డీని తయారు చేసింది. ఈ 5డి వ్యాక్సిన్‌కు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. రోటావాక్ 5డి పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని, అంతేకాకుండా నిల్వ, సరఫరాకు కూడా […]