ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు చలానా విధించినా వాహనదారులు వాటికి కట్టకుండా లైట్‌గా తీసుకొని వాహనలు నడుపుతున్నారు. తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అంటున్నారు. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనంపై ఏ ఒక్క చలానా కూడా పెండింగ్‌లో ఉండకూడదని, ఒకవేళ పెండింగ్‌లో చలానాలు ఉంటే వాహనాన్ని వెంటనే సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వాహనానికి సంబందించి ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా దానిని సీజ్ చేసే రైట్ ఉందని పోలీసులు చెబుతున్నారు. బయటకు వచ్చే సమయంలో వాహనాలకు సంబందించి చలానాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని బయటకు రావాలని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.
Read: తెలంగాణలో వైసీపీ బలోపేతం కానుందా?