కరోనా సెకండ్ వేవ్ తరువాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో మార్కెట్లు తిరిగి పాత సోభను సంతరించుకుంటున్నాయి. కరోనా సమయంలో పైపైకి కదిలి సామాన్యుడు కొనలేనంతగా మారిపోయిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం ధర రూ. 44,990 వద్ద ఉన్నది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే, వెండి ధరలు మాత్రం పైపైకి కదిలాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.73,100కి చేరింది.
Read: వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు అమెజాన్ బిగ్ ఆఫర్ ?