ఈమధ్యకాలంలో పెళ్లిల్లు చాలా వెరైటీగా జరుగుతున్నాయి. పెళ్లి సమయంలో చేసే హంగామా, అనుసరించే విధానం కొత్తగా ఉంటున్నాయి. ఆ మధ్య పెళ్లి కూతురు సడెన్ దెయ్యంలాగా కనిపించిందని పెళ్లిపీటల మీదనుంచి పెళ్లి కొడుకు పారిపోయిన వీడియో వైరల్ అయింది. అదే విధంగా, పెళ్లి రిసెప్షన్‌లో ఓ వ్యక్తి వధువుకు ముద్దు ఇవ్వడం మరో హైలైట్. ఇలానే ఇప్పుడు ఓ వివాహం రిసెప్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రిసెప్షన్ సమయంలో నూతన వధూవరులు వేదికపై కూర్చోని […]
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వందకు పైగా ఉన్నది. దీంతో సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నేతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెట్రోల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు […]
మాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. సామాగ్రీ, కూలీలతో వెళ్తున్న లారీని ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 41 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 33 మందిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెగో పట్టణానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హెవీ లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. […]
మేషం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. వృషభం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల […]
ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ గురించిన ఏ చిన్న వార్త అయినా ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రపంచానికి ఎలాంటి చేటు తీసుకొస్తారో అని భయపడుతుంటారు. గత ఏడాది నుంచి అనేకమార్లు కిమ్ ప్రపంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అలా దూరంగా ఉన్నన్ని రోజులు ప్రపంచంలో తెలియని భయం నెలకొనేది. కిమ్ ఆరోగ్యం బాగాలేదా, లేదంటే రహస్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా అసలు కిమ్ ఉన్నారా […]
2019 డిసెంబర్‌లో వూహాన్‌లో కరోనా మొదటి కరోనా కేసు వెలుగుచూసింది. అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే, కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. ఆ తరువాత ఆ నగరం మెల్లిగా కరోనా నుంచి కోలుకుంది. అయితే, సంవత్సరం తరువాత మళ్లీ వూహన్ కరోనా కేసు నమోదైంది. దీంతో ఆ నగరంలో కరోనా కలకలం రేగింది. సంవత్సరం తరవాత […]
మనిషి దగ్గినపుడు, తుమ్మినపుడు నోటి నుంచి తుంపర్లు గాల్లోకి వెలువడతాయి. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో కరోనా ఉంటే అది ముక్కు, నోటిద్వారా బయటకు వస్తుంటాయి. అక్కడి నుంచి మరోకరికి సోకుతుంటాయి. అయితే, పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు సరికొత్త విషయాలను గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి కంటి నుంచి వచ్చే కన్నీటిలో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 120 మంది రోగులపై […]
అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి సరైన పరిష్కారమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా […]