మాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. సామాగ్రీ, కూలీలతో వెళ్తున్న లారీని ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 41 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 33 మందిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెగో పట్టణానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హెవీ లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
Read: ఆకట్టుకున్న అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ట్రైలర్