ఇండియాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు 30 వేల వరకు నమోదవుతుండగా, గత రెండు రోజుల నుంచి మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కి చేరింది. ఇందులో 3,09,74,748 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,11,076 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 533 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,26,290కి చేరింది.