దేశంలో ఎక్కువగా వినియోగించే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. కరోనా కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అయితే, ఇప్పుడు మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటుండటంతో పెరిగిన ధరలు దిగివస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,940 వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.400 మేర పెరిగి రూ.73,100కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గుతున్నప్పటికీ దేశంలో వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
Read: అక్షయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “బెల్ బాటమ్”కు పోటీ లేదు