ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా నిర్వహించడం వలన అధికవ్యయం అవుతున్నది. అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఒకేసారి ఖర్చు చేస్తే సరిపోతుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి. అదే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చును కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సమానంగా పంచుకోవాలి.
Read: కియార… ఉత్తరాది నయనతార!
ఫలితంగా రాష్ట్రానికి కొంత డబ్బు ఆదా అవుతుంది. అంతేకాదు, రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాల నిర్వాహణకు ఇబ్బందులు తలెత్తవు. జమిలి ఎన్నికల అంశం చాలా కాలంగా పరిశీలనలో ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జమిలి ఎన్నికలకు సంబందించిన విషయాలను మరింత మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసిందని. ఇవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు.