కొన్ని వస్తువులు ఉన్నట్టుండి కదులుతుంటాయి. అవి ఎందుకు అలా కదులుతాయో తెలియదుగాని అలాంటి విషయాలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఆ విషయాల గురించి నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తుంటారు. కొంతమంది వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని చెబితే, మరికొందరు మాత్రం వాటిని దెయ్యాలుగా చెబుతుంటారు. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అది నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతం. రాజేంద్ర అనే ఆటో డ్రైవర్ తన ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో వింతఆకారానికి సంబందించిన ఫుటేజ్ రికార్డ్ అయింది. ఉన్నట్టుండి ఓ ఆకారం పరుగులు తీస్తున్నట్టు సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
Read: “శాకుంతలం”లో బాలీవుడ్ నటుడు
అది ఖచ్చితంగా దెయ్యం అని, ఈ వీధిలోని పాడుబడిన భవంతిలోకి దెయ్యం పరుగులు తీసిందని రాజేంద్ర కుటుంబం చెబుతున్నది. అంతేకాదు, ఆ వీధిలోని పాడుబడిన ఇంటి నుంచి అప్పడప్పుడు శబ్ధాలు వస్తుంటాయని కూడా చెబుతున్నారు. దీంతో శతాబ్దినగర్‌లో దెయ్యం హాట్ టాపిక్‌గా మారింది. రాత్రి సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆ వీధిలో దెయ్యం ఉందని నిరూపిస్తే రూ.25 లక్షలు ఇస్తామని హేతువాదులు చెబుతున్నారు. కానీ, నిరూపించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.