విడుదలైన తొమ్మిది వారాల తరువాత ఎట్టకేలకు మొదటి స్టానాన్ని విడిచి పెట్టింది ‘బట్టర్’ సాంగ్. బీటీఎస్ బాయ్స్ రిలీజ్ చేసిన 2021 సెన్సేషన్ ‘బట్టర్’ పాట బిల్ బోర్డ్ లో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక కాలం నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న పాప్ నంబర్ నైన్ వీక్స్ తరువాత ఫోర్ట్ ప్లేస్ కి పడిపోయింది. ద కిడ్ లారోయ్, జస్టిన్ బీబర్ స్టే టాప్ పొజీషన్ ని ఆక్రమించగలిగాయి. అలాగే, ఒలివియా రోడ్రిగో ‘గుడ్ […]
కన్నడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలు కలిసి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంవత్సరం తిరగక ముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేసీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పరిపాలన సాగించారు. వయసు రిత్యా ఆయన పదవి నుంచి తప్పుకొవడంతో బొమ్మైని ముఖ్యమంత్రి పదవి లభించింది. పాత మంత్రి వర్గాన్ని కొనసాగించకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రక్షాళన చేశారు. 18 […]
ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. పైగా గ్లామరస్ మల్టీ స్టారర్ ప్రకటించాడు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ లాంటి ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్ […]
ప్రతి ఏడాది నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించాలని క్రీడాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. కరోనా సమయంలో సవాళ్లను ఎదుర్కొని జపాన్ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. 17 రోజులపాటు సాగిన ఈ గేమ్స్‌లో 200 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భూమిపై టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తే, స్పేస్‌లో వ్యోమగాములు స్పేస్ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. వ్యోమగాములు రెండు జట్లుగా […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,564కి […]
కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగా సాగుతున్నాయి. అనేక దేశాలు అంతర్జాతీయ సర్వీసులపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మధ్య విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా కొంత మేర తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. అయితే, ఆగస్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కోసం […]
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పాటుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో బీచ్ లో ఉన్నా దుకాణాలు నేలమట్టం అయ్యాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారినట్టు వాతావారణశాఖ పేర్కొన్నది. మత్స్యకారులు చేపల […]
పిల్లల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే వంటి వాటి గురింది అందరికీ తెలుసు. అయితే, బద్దకానికి ఓ రోజు ఉన్నది. ప్రతి ఏడాది ఆగస్టు 10 వ తేదీన జాతీయ బద్దక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ బద్దక దినోత్సవం తీసుకురావడానికి కారణం ఉన్నది. ప్రతిరోజూ మనిషి ఉరుకులు, పరుగుల జీవితంతో గడిపేస్తుంటాడు. క్షణం తీరిక లేకుండా పని పని అని తిరుగుతుంటారు. జాతీయ బద్ధక దినోత్సవం రోజున ఏలాంటి పని లేకుండా ఉండిపోవాలట. […]
మళ్లీ లద్ధాఖ్‌లో అలజడి మొదలైంది. గతేడాది ఇండియ చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో రెండు వైపుల నుంచి ప్రాణనష్టం సంభవించింది. రెండు దేశాల సైనికాధికారుల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల సమయంలో ప్యాంగ్యాంగ్, గోగ్రా హైట్స్ వంటి ప్రాంతాల నుంచి ఇరుదేశాలకు చెందిన సైనికులు వెనక్కి వచ్చేశారు. అయితే, మిగతా ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చేందుకు చైనా ససేమిరా అంటుండటంతో, చైనా నుంచి ఎదురయ్యే […]
తమిళనాడులో గత అన్నాడీఎంకే ప్రభుత్వం పదేళ్లలో పెద్ద మొత్తంలో అప్పులు చేసిందని, సాంకేతికంగా ధనిక రాష్ట్రమైన తమిళనాడులోని మౌళిక వసతుల వినియోగంపై గత ప్రభుత్వం దృష్టిసారించలేకపోయిందని, ఫలితంగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి త్యాగరాజన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన అన్నాడీఎంకే ప్రభుత్వం అందులో 50 శాతం నిధులను రోజువారీ ఖర్చులకు వినియోగించడం వలన రెవిన్యూలోటుగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని 2.16 కోట్ల […]