డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం ఏ మేరకు ఉన్నది అనే విషయంపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కీలక పరిశోధన చేస్తున్నది. ఈ కీలక పరిశోధనల ప్రకారం, కరోనా మొదటితరం ఆల్ఫా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, కానీ, డెల్టా వేరియంట్‌పై ప్రభావం కొంతమేర తక్కువగానే ఉందని ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలలో తేలింది. డిసెంబర్ 1, 2020 నుంచి మే 16, 2021 వరకు శాంపిల్స్‌ను సేకరించి పరిశోధనలు చేశారు. అదే విధంగా మే 17, 2021 నుంచి ఆగస్టు 1, 2021 వరకు మరో 8 లక్షల శాంపిల్స్ నుంచి పరిశోధనలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అన్ని పూహన్‌లో బయటపడినత తొలితరం కరోనా వ్యాక్సిన్ పై ఫైట్ చేసేవిధంగా వ్యాక్సిన్లు రూపొందించబడినట్టు విశ్వవిద్యాలయం నిపుణులు పేర్కొన్నారు. ఫైజర్, అస్త్రాజెనకా వ్యాక్సిన్ల ప్రభావం డెల్లా వేరియంట్‌పై తక్కువగానే ఉందని, రెండో డోసుల వ్యాక్సిన్లు ఐదు నెలల వరకు ప్రభావం చూపుతున్నాయని, అయితే, దీర్ఘకాలిక ప్రభావంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read: ఆఫ్ఘన్‌లో మరో యుద్ధం: తాలిబన్లతో మాజీ ఉపాధ్యక్షుడు పోరాటం…