కాబూల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరులను, ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. తాలిబన్ల భయంలో ఆఫ్ఘన్ ప్రజలు వివిధ దేశాలకు తరలివెళ్తున్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా కాబూల్ నగరం నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై తాలిబన్లు దృష్టిసారించారు. ఎయిర్‌పోర్టువైపు వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. కాల్పులు జరుపుతున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తాలిబన్లు కాల్పులకు […]
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు కాబూల్ నగరంలో హ్యాపీగా తిరుగుతున్న యువత ఒక్కసారిగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తానీయులు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో అమెరికా సీ 17 విమానం ద్వారా రికార్డ్ స్థాయిలో 640 మందిని తరలించారు. ఇది పాసింజర్ రైలు కాదని, అమెరికా సీ 17 విమానం అని అమెరికా ఆర్మీ పేర్కొన్నది. అయితే, ఆ విమానంలో ప్రయాణం చేసింది640 మంది కాదని, […]
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం దేశంలో జీరో కేసులు నమోదవుతున్నాయని న్యూజిలాండ్ దేశం సంబరాలు చేసుకున్నది. వేల మందితో కలిసి మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించారు. అయితే, అది కొంతకాలమే అని మరోమారు తేలిపోయింది. చాలా కాలం తరువాత రాజధాని ఆక్లాండ్‌లో కరోనా కేసు నమోదవ్వడంతో ఆ నగరంలో లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్ విధించినప్పటికీ ఆ నగరంలో కేసులు […]
సాధారణంగా శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ ధరలు తక్కువగా ఉంటుంటాయి. డిమాండ్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ, ఈ ఏడాది శ్రావణమాసంలో చికెన్ ధరలు కొండెక్కాయి. భారీగా ధరలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కిలో చికెన్ ధర రూ.300లకు చేరింది. దీనికి కారణం లేకపోలేదు. డిమాండ్‌కు తగినంత చికెన్ సరఫరా లేకపోవడం కారణంగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు. అంతేకాదు, చికెన్ దాణాకింద వినియోగించే సోయాబీన్, మొక్కజోన్న ధరలు భారీగా పెరిగాయి. […]
సింహాలను చూడాలని అందరికీ ఉంటుంది. జూకి వెళ్లి చూస్తాం. అయితే, అది ఎక్కడో దూరంగా ఉంటుంది. దానిని ఫొటోలు తీసుకొని సంతోషిస్తాం. దగ్గరగా చూడాలంటే సింహాల సంరక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిందే. అక్కడ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి చూసిస్తారు. అయితే, ఎక్కువసేపు అక్కడ ఉండటం కుదరని పని. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. అక్కడ అనేక సింహాల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణా కేంద్రం చాలా ప్రత్యేకమైనది. ఆ కేంద్రంలో భయంకరమైన సింహాలు […]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో తాలిబన్లు పాలనలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది. రాజధానిలో అరాచకాలు జరుగుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద తాలిబన్లు తెగబడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే, ఆఫ్ఘన్ ఆర్మీ పక్కకు తప్పుకున్నా, స్థానిక ప్రజలు ప్రత్యేక దళాలుగా ఏర్పడి తాలిబన్లతో పోరాటం చేస్తునన్నారు. బగ్లాన్ ప్రావిన్స్‌లోని స్థానిక దళాలు తాలిబన్లపై తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. స్థానిక దళాల చేతిలో అనేకమంది […]
ప్రపంచంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో ఆ దేశం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహించిన జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ […]
ఇప్పటికే ఇండియాలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరో మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దేశీయంగా తయారైన జైడస్ క్యాడిలా కంపెనీకి […]
వర్షాకాలం వచ్చింది అంటే దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తుంటాయి. దీనికి కారణం దోమలు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే వైరస్‌లకు వాహకాలుగా ఉంటాయి. దోమల నివారణ కోసం వర్షాకాలంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పడుకునే తప్పనిసరిగా నిండుగా కప్పుకొని నిద్రపోవాలి. తెల్లవారుజామున ఆడ అనోఫిలిస్ దోమ కాటు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆడ […]
దేశం లోపల మనుషులు హాయిగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం, బోర్డర్‌లో సైనికులు కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తుండటమే. దేశాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. దేశ సేవలో తరించే సైనికులు దేశంలోపల కూడా సేవ చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సైనికులు సదా వెంట ఉండి రక్షిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి దేశంలో జరిగింది. ఓ ముదుసలి మహిళ మూసిఉన్న దుకాణం ముందు నిద్రపోయింది. షాపు మూసి ఉండటంతో […]