దేశంలో క్రికెట్ ఆటకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో ఖాలీ దొరికితే పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఇక క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రొఫెషనల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గడుపుతారు. అయితే, కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా కలిసిరాదు. అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్ 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భగత్ బౌలింగ్‌ను అప్పట్లో గంగూలి మెచ్చుకున్నాడు. 2009 నుంచి 2011 వరకు అసోం రంజీట్రోఫి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే, 2011లో ప్రకాష్ భగత్ తండ్రి మరణించడంతో కుటుంబజీవనం కోసం తండ్రి నిర్వహించిన పానీపూరీ వ్యాపారాన్ని నిర్వహిస్తు వస్తున్నాడు. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, అసోం రంజీలో తనతో పాటు ఆడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, తనకు మాత్రం ఎలాంటి ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదని ప్రకాష్ భగత్ వాపోయాడు.
Read: డెల్టాపై ఫైజర్, అస్ట్రాజెనకా ప్రభావం… ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం…