రాఖీ పండగ రోజున బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు పాములు పట్టడంలో నేర్పరి. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు పట్టుతుంటాడు. అయితే, అందరిలా రాఖీ పండుగనే చేసుకుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. రెండు పాములకు రాఖీలు కట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రెండు పాములను పట్టుకున్నాడు. వాటి తోకలను పట్టుకొని పడగపై బొట్టు పెట్టాడు. అయితే, అందులో ఒకపాము మెల్లిగా కదులుతూ ముందుకు వచ్చింది. కానీ దానిని […]
చిన్నపిల్లలు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఇంట్లో సరుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంది. అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు. దానిని ఒపెన్ చేసింది. అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అకట్టుకుంది. ఆ ముక్క బాగా ఉబ్బి సమోసా మాదిరిగా ఉన్నది. మొదట తినాలి […]
ఇటీవలే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ క్రీడలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించారు. కాగా, ఈరోజు నుంచి పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. పారా ఒలింపిక్స్‌కు అన్ని సిద్ధం చేశారు. 22 క్రీడాంశాల్లో 540 పతక ఈవెంట్లు జరగబోతున్నాయి. ఇక భారత్ […]
అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంన్నట్టు ప్రకటించిన తరువాత పూర్తిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అంత త్వరగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారని అనుకోలేదు. దీంతో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 31 వరకు ఆఫ్ఘన్‌లోని అమెరికా పౌరులను, అమెరికా అధికారులను తరలించాలని సైన్యం టార్గెట్ పెట్టుకుంది. ఆగస్టు31 వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఖాళీచేసి వచ్చేయాలని అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు 31 వరకు […]
మేషం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృషభం : రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మిత్రులను […]
ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించింది. జర్మనీని ఓడించి కాంస్యపతకాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల తరువాత హాకీ టీమ్ జట్టు పతకం సాధించడంతో దేశంలోని ప్రభుత్వాలు వారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం ఒ అడుగు ముందుకువేసి వారి ఘనత చిరస్తాయిగా నిలిచిపోయేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. పతకం సాధించిన […]
అమెరికాలోని అనేక బీచ్ ఒడ్డున వేలాది సాండ్ డాలర్లు కొట్టుకు వస్తున్నాయి. ఇలా బీచ్‌లకు కొట్టుకొస్తున్న సాండ్ డాలర్లు నీరు వెనక్కి వెళ్లిపోగానే మృతి చెందుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇటీవల కాలంలో వేల సంఖ్యలో ఇలా సాండ్ డాలర్లు కొట్టుకు వస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలోని నీరు వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తుంటాయి. అయితే, సముద్రంలోని వాతారవణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన […]
సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సముద్రపు పక్షి సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి నిలబడి గ్లాస్ డోర్ తెరుచుకోగానే లోపలికి ప్రవేశించి చిప్స్ ప్యాకెట్ ను ఎత్తుకొచ్చింది. అలానే ఓ మొసలి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశంచి గందరగోళం సృష్టించింది. ఇప్పుడు ఓ భారీ పైతాన్ సూపర్ మార్కెట్ లోపలికి వచ్చి హడావుడి చేసింది. ఈ కొండచిలువ దెబ్బకు కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ సూపర్ మార్కెట్లో […]
బీహార్ రాజధాని పాట్నాలో సుందరవతి అనే కళాశాల ఉంది. పాట్నాలోని ఆ మహిళల కళాశాలకు మంచి పేరు ఉంది. ఈ కాలేజీలో 1500 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కాలేజీకి వచ్చే విద్యార్థినులు తప్పని సరిగా జడ వేసుకొని రావాలని, లూజ్ హెయిర్‌తో వస్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, సెల్ఫీలు దగడంపై నిషేదం విధించారు. దీంతో పాటుగా డ్రెస్‌కోడ్‌ను కూడా తీసుకురావడంతో స్టూడెంట్స్ ఆగ్రహం […]
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యాయి. వారం రోజుల నుంచి చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. నాడునేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు అధునాతనమైన సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజూ వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. స్కూళ్లలోనూ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న డీఆర్ఎం మున్సిపల్ స్కూళ్లో ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు […]