రక్షాబంధన్ రోజుల అన్నయ్యలకు అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అన్ని విధాలుగా అన్న తోడుగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా రాఖీని కడతారు. అయితే, బీహార్ అక్కడి ప్రభుత్వం గత కొన్ని సంవత్సారాలుగా రాఖీ పండుగ రోజున సీఎంతో సహా అనేకమంది మంత్రులు అధికారులు చెట్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ రోజును వృక్షరక్షాబంధన్ దివస్ పేరుతో చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం 2012 నుంచి ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా […]
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా […]
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అరకోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ […]
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్ […]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అందాల కాశ్మీర్‌కు సందర్శకుల రాక మొదలైంది. దాల్ సరస్సులో విహరించేందుకు జమ్ముకాశ్మీర్ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అయితే, చాలాకాలంగా దాల్ సరస్సులో ఫ్లోటింగ్ ఏటీఎంను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఇప్పటికి నెరవేరింది. దాల్ సరస్సులో తెలియాడే ఏటీఎంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఏ ఫెర్రీపై ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లోటింగ్ ఏటీఎం […]
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ […]
డబ్బుల కోసం ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లి అని చూడకుండా ఆమెపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నమ్మక్కల్ జిల్లాలోని పొన్నేరిపట్టిలో నివశించే షణ్ముగం అనే వ్యక్తి డబ్బుల కోసం తల్లిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. గతంలో ఆ తల్లి కుమారుడికి తన పొలం రాసిచ్చింది. అయితే, ఇప్పుడు పొదుపు స్కీంలో దాచుకున్న రూ.3 లక్షలు […]
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్‌ను హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్ కుమార్ […]