సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సముద్రపు పక్షి సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి నిలబడి గ్లాస్ డోర్ తెరుచుకోగానే లోపలికి ప్రవేశించి చిప్స్ ప్యాకెట్ ను ఎత్తుకొచ్చింది. అలానే ఓ మొసలి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశంచి గందరగోళం సృష్టించింది. ఇప్పుడు ఓ భారీ పైతాన్ సూపర్ మార్కెట్ లోపలికి వచ్చి హడావుడి చేసింది. ఈ కొండచిలువ దెబ్బకు కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ సూపర్ మార్కెట్లో జరిగింది. సిడ్నీలోని వాల్వర్త్ సూపర్ మార్కెట్లో హెలెనా అల్టీ అనే మహిళ వంటకు వాడే స్పైసిస్ డబ్బాలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. డబ్బాలు చూస్తుండగా ర్యాకుల మధ్యలోనుంచి ఓ పాము బయటకు వచ్చింది. దీంతో హెలెనా షాక్ అయింది. వెంటనే తేరుకొని మిగతా కస్టమర్లను అలర్ట్ చేసింది. అయితే, గతంలో పాములు పట్టుకోవడంలో ట్రైనింగ్ తీసుకున్న హెలెనా చాకచక్యంగా పైథాన్‌ను పట్టేసి, సురక్షితంగా దానిని అడవిలో వదిలిపెట్టింది. హెలెనా సాహసానికి కస్టమర్లు, సూపర్ మార్కెట్ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.
Read: బీహార్‌లో కొత్త రూల్: ఇకపై విద్యార్థినులు కాలేజీలకు ఇలా వస్తే… బయటకే…